Kaizer News

Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక

Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి

· Entertainment · ntvtelugu.com

మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి : --> Add as a preferred source on google గత ఏడాది ఎటువంటి హోప్స్‌ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిల్మ్ సైయారా. ఛావా సక్సెస్‌లతో బోర్ ఫీలౌతున్న బాలీవుడ్ మూవీ లవర్స్‌ రిలాక్స్‌ అయ్యేలా చేసాయి. అహన్ పాండే, అనీత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు…ఈ మూవీ షూటింగ్ టైంలోనే అహన్, అనీత్ ప్రేమలో ప్డడారని బీటౌన్ బజ్ క్రియేట్‌ అయింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన సైయారాతో ఊహించని విధంగా.. కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చిన వార్2 డిజాస్టర్‌ అయినా… ఈ లాభాలతోనే గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్ మూవీగా సైయారా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో ధర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఒకటిగా నిలిచిపోయింది. మళ్లీ ఈ కాంబినేషన్‌తో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ప్లాన్‌ చేస్తోందట…సైయారా మూవీ టీం. అహన్ పాండే, అనీత్ పద్దా హీరో హీరోయిన్స్‌గా, మోహిత్ సూరీ దర్శకత్వంలో మరో మూవీ త్వరలో తెరకెక్కబోతోంది. ఈ మూవీని కూడా యశ్ రాజ్ ఫిల్మే నిర్మిస్తోంది. గతంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ఎనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అక్టోబర్ నుండి మూవీ షూటింగ్‌ స్టార్ట్ కాబోతోందని టాక్. తొలుత వైఆర్ఎఫ్ స్టూడియోలో… ఆ తర్వాత గోవాలో షూట్ అని ప్లాన్‌ చేసారు.. ‘సాత్ రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. సైయారాకు ముందు ఈ జోడీ గురించి ఎవరికి తెలియదు.. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎలాంటి అంచనాలు లేవు. కానీ రాబోయే సినిమాను సైయారాతో పోల్చడం కామన్. అంచనాలు కూడా వేరే లెవల్లో ఉంటాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.. మూవీ టీం

Original source: ntvtelugu.com
Read more on Kaizer News