మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి గ్రాండ్ ఎంట్రీ. ఏసియన్ సినిమాస్‌తో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు. ప్రస్తుత ప్రపంచ రికార్డును మించి భారీ స్క్రీన్ హైదరాబాద్‌లో. త్వరలో మరిన్ని వివరాలు, హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు. టాలీవుడ్ టాప్ హీరోలలో కొంత మంది థియేటర్ బిజినెస్‌లో అడుగు పెట్టారు. తమ పేరుతో మల్టీప్లెక్స్‌లు కట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు 'ఏఎంబీ', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమో 'ఏఏఏ', మాస్ మహారాజా రవితేజ 'ఏఆర్‌టీ' అంటూ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మల్టీప్లెక్స్‌లు కట్టారు. అల్లు ఫ్యామిలీ కోకాపేట్‌లో 'అల్లు సినిమాస్' నిర్మించింది. ఇప్పుడు ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి అడుగు పెడుతున్నారు. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ హీరోలు అందరితో మల్టీప్లెక్స్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఏసియన్ సినిమాస్ సంస్థతో చిరంజీవి కూడా థియేటర్ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. .. మహేష్ కోసం మానస ఎమోషనల్ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని పూలర్ ప్రాంతంలో ఉన్న 'రాయల్ సినిమాస్ 14 ఐమాక్స్ డ్యూయల్ లేజర్' స్క్రీన్ ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్. ఆ రికార్డు దాని పేరిట ఉంది. ఆ స్క్రీన్ 101 అడుగుల వెడల్పు, 76.2 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆ థియేటర్ దాదాపు 7,696 చదరపు అడుగుల భారీ వైశాల్యంలో విస్తరించి ఉంది. అంతే కాదు... ఆ థియేటర్‌లో 363 రెక్లైనర్ సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో అంత కంటే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడానికి చిరంజీవి - ఏసియన్ సినిమాస్ సంస్థ రెడీ అవుతోందని సమాచారం. సేమ్ అటువంటి స్క్రీన్ లేదంటే దాని కంటే ఒక్క ఇంచ్ ఎక్కువ ఉన్న స్క్రీన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు అయ్యాయి. .. వినాయకునికి ప్రత్యేక పూజలు చిరంజీవి - ఏసియన్ సినిమాస్ సంస్థ భాగస్వామ్యంలో ఏర్పాటు కాబోయే స్క్రీన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. అది గనుక రెడీ అయితే... ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో హైదరాబాద్ సిటీకి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. .. మళ్ళీ అమ్మాయి పుట్టిందోచ్ మెగాస్టార్ చిరంజీవి ఏ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు? చిరంజీవి ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి థియేటర్ల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. చిరంజీవి - ఏసియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న రికార్డును బద్దలు కొట్టనుంది. ప్రస్తుతం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని పూలర్ ప్రాంతంలో ఉన్న 'రాయల్ సినిమాస్ 14 ఐమాక్స్ డ్యూయల్ లేజర్' స్క్రీన్ ప్రపంచంలోనే అతిపెద్దది. చిరంజీవి - ఏసియన్ సినిమాస్ ఏర్పాటు చేయబోయే ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. Up Next Up Next Up Next Up Next స్టేజిపై ఏడ్చేసిన లేడీ