Kaizer News

Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 18వ

Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 18వ అవతరణ దినోత్సవం!

· City - Hyderabad · hmtvlive.com

Shorts హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో 18వ కళాశాల అవతరణ దినోత్సవ వేడుకలను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అలుమ్ని అసోసియేషన్ కోఆర్డినేటర్ డా. ఏ. దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు గోల్డ్ మెడల్స్, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అకడమిక్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వివిధ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించినవారిని సత్కరించారు. వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, రంగోలి తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News