Kaizer News

Shamirpet | గంజాయి చాక్లెట్ల విక్రేత అరెస్ట్…

Shamirpet | గంజాయి చాక్లెట్ల విక్రేత అరెస్ట్…

· City - Hyderabad · prabhanews.com

Shamirpet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన బైద్‌నాథ్‌ (29) తుమ్ముకుంటలోని తన పాన్‌షాప్‌ నుంచి ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు పాన్‌షాప్‌పై దాడి చేసి పెద్ద ఎత్తున గంజాయి కలిపిన చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5,298 ప్యాకెట్లు పట్టుబడగా, వాటి బరువు సుమారు 25 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో బైద్‌నాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని భార్య పూజా కుమారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చాక్లెట్లు ఎక్కడి నుంచి తెప్పించారు? ఎవరెవరికి విక్రయించారు? వీటి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపైనా విచారణ కొనసాగుతోంది

Original source: prabhanews.com
Read more on Kaizer News