Kaizer News

త్రిశూలి నదిలో పెరుగుతున్న ఉధృతి..

త్రిశూలి నదిలో పెరుగుతున్న ఉధృతి..

· National - India · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేపాల్‌లో భారీ వర్షాలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో త్రిశూలి ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక హెలికాప్టర్‌ టేకాఫ్‌ కావడం సాధ్యంకాకపోవడంతో ఆపరేషన్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం తగ్గి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే సహాయక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో త్రిశూలి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహక ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది

Original source: prabhanews.com
Read more on Kaizer News