Kaizer News

రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది నియామకాలు ఎప్పటిలోగా?

రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది నియామకాలు ఎప్పటిలోగా?: సీపీఎం

· City - Hyderabad · prabhanews.com

పడకలకు పెరిగిన రిమ్స్‌లో.. 350 పడకల నాటి సిబ్బందేనా? సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ఎప్పటికి మారుస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీపీఎం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం రిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఎప్పటిలోగా నియమిస్తారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిమ్స్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్‌ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసి, పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలని, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రమోట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రమోట్‌ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్నా ఎందుకు అమలు చేయలేదని గోవిందరావు ప్రశ్నించారు. వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయకపోవడంతో రిమ్స్‌కు వచ్చే పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు 350 పడకలకు ఉన్న సిబ్బందే ప్రస్తుతం 900 పడకలకు కూడా కొనసాగుతున్నారని, పెరిగిన పడకలకు అనుగుణంగా సిబ్బందిని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఐసీయూలో కనీసం ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదని, ప్రతి పడకకు వెంటిలేటర్‌, మానిటర్‌, ఇన్‌ఫ్యూజన్‌ వంటి అవసరమైన పరికరాలు ఉండాల్సి ఉన్నా అవి అందుబాటులో లేవని ఆరోపించారు. 41 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు గడిచినా పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని గోవిందరావు ప్రశ్నించారు. కొన్ని విభాగాల్లో ఒకరు, ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారని, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ తదితర విభాగాలకు పూర్తిస్థాయిలో వైద్యులు లేరని అన్నారు. గుండె, కిడ్నీ, నరాలు, మూత్ర సంబంధ వ్యాధులు, మెదడు, వెన్నుముక, క్యాన్సర్‌, రేడియేషన్‌ థెరపీ తదితర విభాగాల్లో వారానికి రెండు రోజులు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని ఆరోపించారు. వైద్యులు స్కానింగ్‌ సూచించినా పరీక్షలు చేయించుకునేందుకు నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. కొన్ని విభాగాలకు వైద్యులు ఉన్నప్పటికీ అవసరమైన వైద్య పరికరాలు లేకపోతే చికిత్స ఎలా అందిస్తారని ప్రశ్నించారు. క్యాథ్‌ ల్యాబ్‌ లేకుండా కార్డియాలజీ వైద్యులు యాంజియోగ్రామ్‌ ఎలా చేస్తారని, యూరాలజీ, న్యూరో సర్జరీకి సంబంధించిన శస్త్రచికిత్స పరికరాలు కూడా లేవని ఆరోపించారు. ఐసోలేషన్‌ వార్డు కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, స్టాఫ్‌ నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు, పారిశుధ్య సిబ్బంది పోస్టులను పెరిగిన పడకలకు అనుగుణంగా భర్తీ చేయాలని, అవసరమైన వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి. ప్రసాద్‌, ఎం. సత్యం, ఎం. గోపి, కొత్తకోట అప్పారావు, పి. చంద్రరావు, నందోడు,

Original source: prabhanews.com
Read more on Kaizer News