Kaizer News

Delhi Crime News: ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. స్లీపర

Delhi Crime News: ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్! నిందితుల అరెస్ట్

· City - Hyderabad · telugu.abplive.com

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్లీపర్ బస్సులో విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఓ చోట బాలికను వదిలేసి వెళ్లిపోయిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆ ప్రైవేట్ స్లీపర్ బస్సును పోలీసులు సీజ్ చేశారు. కాశ్మీరీ గేట్ ప్రాంతంలో గుండెలను పిండేసే ఘటన జరిగింది. గత ఆగస్టు 4వ తేదీ రాత్రి ఒక స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు ఆ బస్సు డ్రైవర్ కుల్‌దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్ లోని మైన్‌పురి జిల్లాకు చెందిన బాలిక అని, 11వ తరగతి చదువుతుందని గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా నోయిడాకు వచ్చిన విద్యార్థిని పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులపై కోపంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. యూపీలోని మైన్‌పురి నుంచి వెళ్లిపోయిన బాలిక నోయిడాలో ఉంటున్న తన బాబాయి కొడుకు (కజిన్) వద్దకు వెళ్తోంది. భారీ వర్షం కురుస్తుండగా, అసలే చీకటి కారణంగా విద్యార్థిని పొరపాటున పరీ చౌక్ వద్ద దిగిపోయింది. ఆ సమయంలో ఒక ఖాళీ స్లీపర్ బస్సు అటు వైపు నుంచి వెళ్తోంది. విద్యార్థిని బస్సును ఆగమని సైగ చేయడంతో డ్రైవర్ బస్సు ఆపాడు. నోయిడా సెక్టార్-63కి తీసుకెళ్తామని చెప్పిన డ్రైవర్, కండక్టర్ ఆమెను బస్సు ఎక్కించుకున్నారు. బస్సు కొంతదూరం వెళ్లిన తర్వాత కండక్టర్ బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. తనను బస్సులోనే తిప్పుడూ డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారం చేశారని, ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. కాశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు నిందితులు బాలికపై అత్యాచారం చేసిన తరువాత అర్ధరాత్రి వేళ కాశ్మీరీ గేట్ బస్టాండ్ సమీపంలోని రింగ్ రోడ్డుపై దింపి పరారయ్యారు. భయాందోళనకు గురైన విద్యార్థిని కాశ్మీరీ గేట్ పోలీసులను ఆశ్రయించి వారికి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను తిమార్ పూర్ లోని బస్సు పార్కింగ్ వద్ద అరెస్ట్ చేశారు. అఘాయిత్యం చేస్తున్న సమయంలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు సీజ్ చేసి ఫొరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు. పరీ చౌక్ నుంచి కాశ్మీరీ గేట్ వరకు 47 కిలోమీటర్లు పోలీసులు తెలిపిన ప్రకారం, బస్సులో సాంకేతిక లోపం రావడంతో నిందితులు దానిని రిపేరు కోసం సూరజ్‌పూర్ లోని వర్క్‌షాప్‌కు తీసుకెళ్లారు. బస్సు రిపేరు పూర్తయిన తర్వాత డ్రైవర్, కండక్టర్ ఖాళీ బస్సులో తిమార్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలోనే పరీ చౌక్ వద్ద బస్సు కోసం చూస్తున్న విద్యార్థిని వారికి కనిపించింది. ఒంటరిగా ఉన్న బాలికను బస్సు ఎక్కించుకున్నాక పరీ చౌక్ నుంచి కాశ్మీరీ గేట్ వరకు బస్సు సుమారు 47 కిలోమీటర్ల దూరం వెళ్తున్న సమయంలో కండక్టర్, డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బస్సు స్లీపర్ బస్సు కావడం, దానికి తెరలు ఉండటం వల్ల బస్సు లోపల ఏం జరుగుతుందో ఎవరూ గుర్తించలేకపోయారని పేర్కొన్నారు. జర్నలిజంలో గత పదేళ్లుగా

Original source: telugu.abplive.com
Read more on Kaizer News