కేటీఆర్‌దంటున్న కాంగ్రెస్.. తనదే అంటున్న యజమాని ప్రదీప్‌రెడ్డి లీజుకు తీసుకున్నానంటున్న కేటీఆర్.. యాజమాన్యంపై రికార్డులే కీలకం భూములు, నిర్మాణాలు, అనుమతులపై మళ్లీ మొదలైన రాజకీయ రగడ జన్వాడలో భారీ పోలీస్ బందోబస్తు.. కాంగ్రెస్ నేతల పర్యటనతో హీట్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంబంధం ఉన్న ఈ ఫామ్‌హౌస్ యాజమాన్యం, భూముల స్వరూపం, నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య చాలాకాలంగా భిన్న వాదనలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జన్వాడలోని ఫామ్‌హౌస్‌ను సందర్శించి భూముల వివరాలను పరిశీలించాలని నిర్ణయించడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో శంకర్‌పల్లి మండలం జన్వాడలో పోలీసులు భారీగా మోహరించారు. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ ఆస్తి కేటీఆర్‌కు సంబంధించినదేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫామ్‌హౌస్ యజమానిగా ముందుకొచ్చిన బి. ప్రదీప్‌రెడ్డి మాత్రం భూమి, ఫామ్‌హౌస్ తన సొంతమని స్పష్టం చేశారు. తాను 2019లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశానని, కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో ఆ ప్రాపర్టీని ఆయనకు లీజుకు ఇచ్చానని ప్రదీప్‌రెడ్డి వెల్లడించారు. భూమికి చట్టబద్ధమైన పత్రాలు, క్లియర్ టైటిల్ ఉన్నాయని తెలిపారు. అవసరమైతే అధికారులకు అన్ని రికార్డులు సమర్పించేందుకు సిద్ధమని చెప్పారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా ప్రకటనల ప్రకారం యాజమాన్యం ప్రదీప్‌రెడ్డిదని, కేటీఆర్ లీజుదారుడని ప్రదీప్‌రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న యాజమాన్య సంబంధిత ఆరోపణలు దీనికి భిన్నంగా ఉన్నాయి. జన్వాడ ఫామ్‌హౌస్ తన సొంత ఆస్తి కాదని కేటీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. తన స్నేహితుడైన ప్రదీప్‌రెడ్డికి చెందిన ప్రాపర్టీని తాను లీజుకు తీసుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో అక్రమంగా ఉన్నట్లు అధికారికంగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు. అందువల్ల ‘కేటీఆర్‌దే ఫామ్‌హౌస్’ అనే రాజకీయ ఆరోపణకు, ‘ప్రదీప్‌రెడ్డిదే.. కేటీఆర్ లీజుకు తీసుకున్నారు’ అనే యాజమాని వివరణకు మధ్యే అసలు వివాదం కేంద్రీకృతమైంది. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో కాంగ్రెస్ నేతలు కేవలం యాజమాన్యాన్నే ప్రశ్నించడం లేదు. భూముల వినియోగం, నిర్మాణాల అనుమతులు, ఎఫ్‌టీఎల్ పరిధి, గతంలో అమల్లో ఉన్న నిబంధనలు వంటి అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గండిపేట, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు సంబంధించిన గత నిబంధనల నేపథ్యంలో జన్వాడ ప్రాంతంలోని నిర్మాణాలపై గతంలోనూ ప్రశ్నలు తలెత్తాయి. 2024లో జన్వాడలోని ఒక ఫామ్‌హౌస్‌పై ఎఫ్‌టీఎల్, జీఓ 111 నిబంధనలకు సంబంధించిన అంశాలు అధికారుల పరిశీలనకు వచ్చాయి. ఆ సమయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఫిరంగి నాలా హద్దులపై కూడా సర్వే నిర్వహించారు. అయితే ఏదైనా నిర్మాణం నిబంధనలకు విరుద్ధమా కాదా అన్నది అధికారిక రికార్డుల