ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) పథకంలో వేతన పెంపు జరిగి పుష్కరకాలం గడిచింది. ఆలస్యంగానైనా, ఇన్నేళ్లకు మళ్లీ కదలిక వచ్చింది. సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వర్తించే ఈపీఎఫ్ పథకంలో చేరడానికి నిర్దేశించిన గరిష్ఠ వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందనీ, త్వరలో అమలయ్యే అవకాశముందని తెలుస్తోంది.