Kaizer News

చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్‌ హెల్ప్‌!

చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్‌ హెల్ప్‌!

· Technology · sakshi.com

ఇం ట్లో పెద్ద సమస్యలకే కాదు, చిన్న చిన్న చికాకులు చాలు.. రోజంతా తల పట్టుకోవడానికి! ఈ రోజువారీ తలనొప్పులకు టెక్నాలజీ కాస్త చిలిపిగా సాయం చేస్తే? చూడటానికి ముద్దుగా, వాడటానికి సులభంగా, పనిలో నిజాయితీగా ఉండే కొన్ని చిట్టి గ్యాడ్జెట్లు ఇప్పుడు మీకోసం! చేతులు కడుక్కో... ఆడుతూ నేర్చుకో! ‘చేతులు కడుక్కున్నావా?’ అని అమ్మ రోజుకు ఎన్నిసార్లు అడిగినా... బుజ్జోడికి మాత్రం ఆ ప్రశ్న వినిపించనట్టే! అందుకే, ఇప్పుడు చేతులు కడుక్కోవడం ఒక పనిలా కాకుండా, చిన్న సరదా గేమ్‌లా మార్చేందుకు వచ్చిందే ఈ క్యూట్‌ నత్త సోప్‌ డిస్పెన్సర్‌. నత్త ఆకారం పిల్లలను ఆకట్టుకోవడంతో సబ్బు తీసుకోవడానికి వాళ్లే ముందుకొచ్చేలా చేయొచ్చు. చిన్నగా ఉండటంతో సింక్‌ దగ్గర పిల్లలకు సులభంగా అందుబాటులో పెట్టుకోవచ్చు. ఇందులో 120 మిల్లీలీటర్ల వరకు లిక్విడ్‌ సోప్‌ నింపుకోవచ్చు. పంప్‌ నొక్కగానే సబ్బు బయటకు రావడంతో చేతులు కడుక్కోవడమూ వాళ్లకు ఒక చిన్న గేమ్‌లా అనిపిస్తుంది. తినే ముందు, బయట ఆడుకుని వచ్చిన తర్వాత, బాత్‌రూమ్‌ నుంచి వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకునే అలవాటును ఇలా సరదాగా నేర్పించొచ్చు. మార్కెట్‌లో మరెన్నో బొమ్మల రూపాల్లోనూ ఈ సోప్‌ డిస్పెన్సర్‌ బాక్స్‌లు ఉంటాయి. ధర రూ.300 మాత్రమే! బట్టలు ఆరేయడానికి... గోడే గ్రౌండ్‌! వానాకాలంలో బట్టలు ఉతకడం ఓ సమస్య అయితే... వాటిని ఆరేయడం మరో పెద్ద సమస్య! ఇంట్లో తాడు కడితే దానికి బట్టలే కాదు... మన ఇల్లు మొత్తం వేలాడుతున్నట్టుంటుంది. ఇక స్టాండ్‌ పెడితే నడవడానికి దారి ఉండదు. ఈ సమస్యకు ఒక తెలివైన పరిష్కారమే ఈ రిట్రాక్టబుల్‌ క్లాత్స్‌లైన్‌. దీన్ని గోడకు అమర్చి, అవసరమైనప్పుడు బయటకు లాగితే నాలుగు లైన్లు రెడీ! బట్టలు, టవల్స్, బెడ్‌షీట్స్‌ వంటివి ఆరేసుకోవచ్చు. పని అయిపోయాక లైన్లను మళ్లీ లోపలికి పంపేస్తే... గోడ మీద చిన్న బాక్స్‌లా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నా, బాత్‌రూమ్‌ నుంచి బాల్కనీ వరకు ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అలా ఇప్పుడు బట్టలు ఆరేయడానికి ఇల్లు పెద్దగా ఉండాల్సిన పనిలేదు... గోడ ఉంటే చాలు! ధర రూ.750 మాత్రమే! బ్యాగ్‌లో పట్టే కెటిల్‌! ప్రయాణాల్లో టీ కావాలి... కాఫీ కావాలి... నూడుల్స్‌ కావాలి! అదీ... ఇంట్లో చేసుకున్నట్టుగా! కానీ కెటిల్‌ తీసుకెళ్దామంటే బ్యాగ్‌లో ప్లేస్‌ ఉండదు. అయితే, ఈ కెటిల్‌ మాత్రం అలా కాదు! వాడేటప్పుడు కెటిల్‌లా.. పని అయిపోయాక మడిస్తే చిన్న స్నాక్‌ బాక్స్‌లా పనిచేస్తుంది. 600 మిల్లీలీటర్ల సామర్థ్యంతో నీటిని త్వరగా మరిగించి టీ, కాఫీ, నూడుల్స్, ఓట్స్, సూప్‌ వంటివి సిద్ధం చేసుకోవచ్చు. 600 వాట్ల పవర్‌తో పనిచేసే ఇందులో నీరు మరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యే సదుపాయంతో పాటు, నీరు లేకుండా వేడెక్కకుండా రక్షణ కూడా ఉంది. హాస్టల్‌ నుంచి హోటల్‌ వరకు... ప్రయాణం నుంచి క్యాంపింగ్‌ వరకు ఎక్కడైనా వెంట తీసుకెళ్లొచ్చు. అంటే... బ్యాగ్‌లో బట్టలకే చోటు లేకపోయినా... కెటిల్‌కు మాత్రం చోటు దొరికేస్తుంది! ధర రూ.500 మాత్రమే! ఇవి చదవండి: ‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం! షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటో

Original source: sakshi.com
Read more on Kaizer News