Kaizer News

తెలంగాణకు కొత్త దిశ.. ద‌శ‌

తెలంగాణకు కొత్త దిశ.. ద‌శ‌

· City - Hyderabad · prabhanews.com

సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు.. రైతు, మహిళ, యువతకు అండగా ప్రభుత్వం పెట్టుబడులు, మౌలిక వసతులు, సామాజిక న్యాయంతో ‘తెలంగాణ రైజింగ్‌–2047’కు పునాదులు హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనా మైలురాయిని చేరుకుంది. 2023 డిసెంబర్‌ 7న బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం.. సెప్టెంబర్‌ 1 నాటికి వెయ్యి రోజుల పాలనను పూర్తి చేయనుంది. ఈ కాలంలో సంక్షేమ పథకాల విస్తరణతోపాటు రైతు రుణమాఫీ, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యా–వైద్య రంగాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, హైదరాబాద్‌ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ వెయ్యి రోజుల పాలనలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌ తెలంగాణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ పురోగతి కనిపిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. 2025–26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు 91 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతోందని తెలిపింది. అయితే ఈ ఆర్థిక పురోగతి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరేలా చూడటం ప్రభుత్వానికి కీలక సవాలుగా నిలవనుంది. రైతు రుణమాఫీ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో కీలక నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి లభించిందని పేర్కొంది. రైతు భరోసా పథకం కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించగా.. ఒకే విడతలో తొమ్మిది రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు నిరంతర భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. గత 32 నెలల కాలానికి సంబంధించిన లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ దేశంలో అగ్రస్థానానికి చేరిందని పేర్కొంది. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు సృష్టించినట్లు తెలిపింది. మరోవైపు కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూరియా కొరత వంటి సమస్యల సమయంలో ప్రభుత్వానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపింది. మహిళల జీవితాల్లో మార్పు.. ఆర్థిక సాధికారతకు అడుగులు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం క

Original source: prabhanews.com
Read more on Kaizer News