Kaizer News

Deepveer | రెండోసారి తల్లిదండ్రులైన దీప్‌వీర్.. పం

Deepveer | రెండోసారి తల్లిదండ్రులైన దీప్‌వీర్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక..!

· Entertainment · ntnews.com

Deepveer : బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సిద్ది వినాయకుడి గణేశుడి ఆశీర్వాదం తీసుకున్న మరునాడే దీపిక పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ తీపి కబురును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా పంచుకుంది దీప్‌వీర్ జోడీ. ఇప్పటికే వీరికి దువా పదుకొనే సింగ్ అనే కూతురు ఉంది. ఇప్పుడు మరో బుజ్జాయి రాకతో వీరి కుటుంబంలో సంతోషం రెండింతలైంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనె(40) రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలు పంచుకున్న దీపికకు శనివారం పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని దీపిక, రణ్‌వీర్ జంట ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు వెల్లడించింది. తమ చిన్నారి కాలి ముద్ర ఫొటోకు.. ‘చిన్ని బుజ్జాయికి స్వాగతం’ అనే క్యాప్షన్ జోడించిందీ స్టార్ జోడీ. రెండోసారి తల్లిదండ్రులైన దీపిక, రణ్‌వీర్‌లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ గారాలపట్టి దుపా పదుకొనె సింగ్ రెండో పుట్టిన రోజును పునస్కరించుకొని సెప్టెంబర్ 8వ తేదీన దీపిక తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే

Original source: ntnews.com
Read more on Kaizer News