కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి. కొత్త ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మకాలు దేవుడెరుగు, ఉన్న పాత ఆస్తులను అమ్ముకుందామన్నా వీల్లేకుండా మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. పైగా 22ఏ నిషేధిత భూముల జాబితా నిబంధనల ఉచ్చు, స్పష్టత లేని విధానాలతో రీసేల్ సెగ్మెంట్ అట్టడుగుకు నెట్టేసింది. ఇప్పటికే మందగమనంతో ఉన్న రియల్ రంగానికి కాంగ్రెస్ వ్యవహార శైలి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందని రియల్ వ్యాపారులు ఆగహం వ్యక్తం చేస్తున్నారు