1600 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి కాఠ్మాండూ, ఆగస్టు 30: ఎంతో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని నేపాల్ పౌరులు రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు. 47 ఏండ్ల రాజేంద్ర ద్వివేది త్రిశూల్‌లో ఉన్న త్రిభువన్ త్రిశూలి మాధ్యమిక పాఠశాలకు ప్రిన్సిపాల్. వరద ముప్పు ముంచుకు వస్తున్నదంటూ బుధవారం ఉదయం 9.20 గంటలకు తన స్నేహితుడు పంపిన సమాచారంతో ఆయన అప్రమత్తమయ్యారు. నదికి 60 మీటర్ల ఎగువన స్కూల్ ఉన్నందున 1,643 విద్యార్థులను మూడంతస్తులు పాఠశాల భవనం పైకి తీసుకుపోవాలని తొలుత భావించాడు. అయితే అది అంత సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చాడు. విద్యార్థులందరినీ తరగతి గదుల్లోంచి బయటకు తీసుకురావాలని పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఆదేశించాడు. అత్యవసరంగా స్కూల్ బస్ డ్రైవర్లందరినీ రప్పించి విద్యార్థులను వాటిపై తరలిద్దామని ప్రయత్నించాడు. అయితే అప్పటికే వరద సమీపంలోకి వస్తుండటంతో అది కూడా క్షేమం కాదని భావించి పిల్లలను తీసుకుని పాఠశాలకు సమీపంలో ఎత్తయిన ప్రాంతానికి తీసుకుని పోయి ఒక బోధి వృక్షం కింద వారిని ఉంచాడు. ఇంతలో ఉప్పెనలా దూసుకువచ్చిన వరద ధాటికి మూడంతస్తుల పాఠశాల భవనం కొట్టుకుపోవడం చూసి విద్యార్థులు హాహాకారాలు చేశారు. తాము పాఠశాల భవనంలో ఉండి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుని భయంతో వణికారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఆ ఉపాధ్యాయుడిని పౌరులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు. ఐదుగురు స్నేహితుల్ని కాపాడిన ‘టీ బ్రేక్’ న్యూఢిల్లీ, ఆగస్టు 30: కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయమే..జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు ‘టీ బ్రేక్’ కోసం ఒక చోట ఆగటం, నేపాల్ వరదల్లో చిక్కుకోకుండా ప్రాణాలతో బయటపడేసింది. వారి ప్రయాణంలో ఈ చిన్న విరామం భయంకరమైన విపత్తులో చిక్కుకోకుండా చేసింది. నేపాల్‌లో పర్యటిస్తున్న ఐదుగురు స్నేహితులు ఆగస్టు 26న మలేఖు వద్ద టీ తాగడానికి ఓ హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహించటంతో వారు వెళ్లాల్సిన మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఒకవేళ వారు 10-15 నిమిషాల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఉంటే వరదల్లో చిక్కుకొని ఉండేవారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆ ఐదుగురు ఎత్తయిన ప్రదేశంలో కారులోనే రెండు రాత్రులు భయంతో గడిపారు. స్థానిక పోలీసులు, అధికారుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఆగస్టు 28న నేపాల్‌ను వీడి శనివారం నాటికి క్షేమంగా తమ ఇండ్లకు చేరుకున్నారు. 21 మంది ప్రాణాలను కాపాడిన చీర చెన్నై: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు నేపాల్‌లోని తిమురే వద్ద సంభవించిన భీకర వరదలు, కొండచరియల బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడి స్వస్థలానికి చేరుకున్నారు. శ్యాబ్రు బేస్, కేరుంగ్ మధ్య ఉన్న పర్వత మార్గంలో అకస్మాత్తుగా వచ్చిన వరద కారణంగా వీరి వాహనం మూడు వైపులా వరద నీటి మధ్య చిక్కుకుపోయింది. ఆ సమయంలో కేవలం డ్రైవర్ వైపు ఉన్న తలుపు ద్వారా మాత్రమే బయటపడే అవకాశం ఉంది. విపత్కర పరిస్థి