Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థిని యశ్విత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె కర్నూలుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి కుమార్తెగా పోలీసులు గుర్తించారు. యశ్విత గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ నీట్ పీజీ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. చదువులో భాగంగా పరీక్షకు ప్రిపరేషన్ తీసుకుంటున్న ఆమె ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యశ్విత మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది