Kaizer News

3,000 మంది గల్లంతు

3,000 మంది గల్లంతు

· National - India · ntnews.com

699కి చేరిన మృతుల సంఖ్య 800 మీటర్ల మంచుకొండ కూలడంతోనే నేపాల్‌లో విపత్తు కొత్తగా రెండు సరస్సులు ఏర్పడటంతో తొలగని ముప్పు కాఠ్మాండూ: నేపాల్‌, టిబెట్‌లలో సంభవించిన వరద విధ్వంసంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి గల్లంతైన వారు మూడు వేలకు, మృతుల సంఖ్య 699కు చేరింది. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులు ఉన్నారు. 400 మందికి పైగా టిబెట్‌లో చిక్కుకుపోయారు. విపత్తు సంభవించిన మూడు రోజులకు హిమానీనదం కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంచుకొండ కూలుతున్న సమయంలో టిబెట్‌లోని గైడ్‌ల బృందం ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించింది. ఓ భారీ మంచుకొండ నుంచి 800 మీటర్ల ముక్క విరిగి కింద లోయలో పడింది. దీంతో ఒక్కసారిగా లోయలోని నీటిపై ఒత్తిడి పెరిగి ఆ వేగానికి చుట్టుపక్కల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ నీటి ప్రవాహం నదుల్లో కలిసి ఇంత భారీ విపత్తుకు కారణమైనట్టు తెలుస్తున్నది. వినాశకరమైన వరదలు, కొండచరియల విపత్తుల అనంతరం రెండు కొత్త సరస్సులు ఏర్పడటంతో నేపాల్‌కు ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఒక సరస్సు నుంచి నీరు పొర్లుతుండగా, మరో సరస్సు పరిణామం పెరుగుతున్నది. దీంతో మళ్లీ వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం వినాశనం సృష్టించిన నేపాల్‌-చైనా సరిహద్దు వద్దే ఈ రెండు కొత్త సరస్సులు ఏర్పడ్డాయి. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం కింది ప్రాంతాలకు భారీగా బురద నీరు, ఇసుక, చిన్న, పెద్ద రాళ్లను తీసుకుపోతున్నది. తీగను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నా ఆకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కొట్టుకుపోతూ ఒక విద్యుత్తు తీగను 30 నిముషాల పాటు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నట్టు త్రిశూలి మార్కెట్‌లోని ఒక స్వీట్‌ షాపులో పనిచేస్తున్న రాంబచన్‌ షా తెలిపాడు. షాపులోని మహిళ, ఆమె కుమారుడు, మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నాడు. త్రుటిలో మృత్యువు నుంచి బయటపడ్డాం వరద విధ్వంసంలో త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నట్టు యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారత సంతతి దంపతులు అంజనా రాజా, పట్టాభిరామన్‌ వెంకటేశ్‌ తెలిపారు. రసువా జిల్లాలో తాము బస్సులో ప్రయాణిస్తుండగా భారీ వరద ప్రవాహం తమ బస్‌వైపు దూసుకువస్తున్న విషయాన్ని గమనించామని అంజనా రాజా తెలిపారు. వెంటనే బస్సులోంచి దూకి పక్కనే ఉన్న 500 మెట్లను క్షణాల్లో ఎక్కి ఇద్దరం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు చెప్పారు. వరదలో కొట్టుకొచ్చిన బ్యాంక్‌ లాకర్‌ భారీ వరదల్లో ఏకంగా బ్యాంక్‌ లాకరే కొట్టుకుని వచ్చింది. దీంతో కొందరు దానిని బద్దలు కొట్టి అందులోని సొమ్మును అపహరించారు. రంగంలోకి దిగిన నేపాల్‌ పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రసువాలోని భోటెఖోషి ప్రాంతంలో వరదల వల్ల కొట్టుకుపోయన ఒక బ్యాంక్‌ సేఫ్‌ ఆ తర్వాత ధాడింగ్‌ జిల్లాలోని గల్చి రూరల్‌ మున్సిపాల్టీ-4 పరిధిలో గల బెల్టుఖోలా వద్ద త్రిశూలీ నదీ తీరంలో లభ్యమైనట్టు సమాచారం. స్థానికులు ఆ లాకర్‌ను బద్దలు కొట్టి అందులోని సొమ్మును అపహరించారు. ఇప్పటివరకు 29 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, వారి నుంచి రూ. 57 లక్షలను స్వాధీనం చేసుకున్న

Original source: ntnews.com
Read more on Kaizer News