TGEAPCET: తెలంగాణ ఉన్నత విద్యామండలి EAPCET (Bi.P.C)–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. Bi.P.C స్ట్రీమ్ అభ్యర్థులకు B.Pharmacy, Pharm-D, బయో-టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్–సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు పూర్తి చేసుకోవాలి