Kaizer News

బిల్లా రంగా బాషా..

బిల్లా రంగా బాషా..

· National - India · ntnews.com

కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్‌ హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బిల్లా రంగా బాషా : ది ఫస్ట్‌ బ్లడ్‌’. అనూప్‌ భండారి దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నది. సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలిపారు. ఈ ప్రమోషన్స్‌ వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యేంత వరకూ సాగుతాయని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేకమైన ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ‘విక్రాంత్‌ రోణా’ తర్వాత సుదీప్‌, అనూప్‌ భండారి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనున్నదని మేకర్స్‌ తెలిపారు. ఇందులో సుదీప్‌ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ పాత్రలో కనిపిస్తారు

Original source: ntnews.com
Read more on Kaizer News