Kaizer News

NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ..

NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

· City - Hyderabad · telugu.abplive.com

నీట్ పీజీ పరీక్షతో హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని హెచ్చరిక. మారథాన్ కారణంగా పరీక్షార్థులకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. రద్దీ, అత్యవసర సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ప్రకటించారు. పరీక్షల ఒత్తిడితో ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్: నీట్ పీజీ (NEET PG 2026) పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 30న) హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నేటి ఉదయం 7 గంటల నుంచే మెయిన్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో నగరంలోని 4 కీలక పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్యారడైజ్ సర్కిల్, తాజ్‌మహల్ జంక్షన్, కింగ్ కోఠి, బండ్లగూడలతో పాటు రేతిబౌలి, నానల్‌నగర్, దుర్గానగర్, కేఎఫ్‌సీ జంక్షన్ల మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఆదివారం ఉదయాన్నే నిర్వహించే "హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్-2026" దృష్ట్యా షేక్‌పేట్‌లోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ కేంద్రానికి వెళ్లే విద్యార్థుల కోసం పోలీసులు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. బోరబండ, మధురానగర్, కల్యాణ్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు జూబ్లీహిల్స్ మీదుగా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్ వైపు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) మీదుగా వచ్చే వాహనదారులు రోడ్ నంబర్ 45- 51 రూట్ ఎంచుకోవాలని, బంజారాహిల్స్ రోడ్ నంబర్లు 14, 10, 12 నుంచి ప్రయాణించే వారు అగ్రసేన్ ఐలాండ్ - ఫిల్మ్‌నగర్ రోడ్డును ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర ప్రయాణం లేదా సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌ 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా పరీక్ష రాసే విద్యార్థులు కాస్త ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను కాకుండా సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ఎగ్జామ్ సెంటర్లకు ముందుగానే చేరేకోవాలని పోలీసులు విజప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న అపరాజిత హాస్టల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్ ఉండగా, తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. గత 6నెలలుగా ఆమె హైదరాబాద్‌లోనే ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల భయమే కారణమని భావిస్తున్నారు. Frequently Asked Questions నీట్ పీజీ పరీక్ష కారణంగా ఏ రోజు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది? నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 30న ఆదివారం నాడు జరగనుంది. ఈ రోజున హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్యారడైజ్ సర్కిల్, తాజ్‌మహల్ జంక్షన్, కింగ్ కోఠి, బండ్లగూడలతో పాటు రేతిబౌలి, నానల్‌నగర్, దుర్గానగర్

Original source: telugu.abplive.com
Read more on Kaizer News