Kaizer News

రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది

రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది

· Entertainment · sakshi.com

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్‌ రోల్‌లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ మైసా. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను' అనే రష్మిక డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్‌ చూస్తుంటే తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళ పాత్రలో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'యుద్ధానికి ఆయుధమంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అనే డైలాగ్‌ మైసాపై మరింత ఆసక్తి పెంచుతోంది. రష్మిక ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News