Shorts వికారాబాద్: శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశము హాలు నందు బి సి వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెదురు సాగు, దాని ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణలో వెదురు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వెదురు ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను పెంచడం, రైతులను వెదురు సాగు వైపు ప్రోత్సహించడం, వెదురుతో ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై కార్యక్రమంలో చర్చించారు. వెదురు పర్యావరణహితమైన వనరుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే పంటగా వివరించారు. ఈ సందర్బంగా మేదరి కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన కేతేశ్వరా స్వామి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. కార్యక్రమంలో బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, డి పి ఓ జయసుధ, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, డి టి డి ఓ జనార్ధన్, హౌసింగ్ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు