Kaizer News

Jubilee Hills: డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జ్

Jubilee Hills: డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జ్‌లతో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సమావేశం

· City - Hyderabad · hmtvlive.com

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జ్‌లతో యూసుఫ్ గూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్‌చార్జ్‌లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్ల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రతి డివిజన్ అధ్యక్షుడు, బూత్ ఇన్‌చార్జ్ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News