తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమిళగ వెట్రి కజగం అధినేత సి. జోసెఫ్ విజయ్ నడుచుకుంటున్న తీరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. సరిగ్గా ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ తరహాలోనే అర్ధరాత్రి ఆసుపత్రులు, సచివాలయ విభాగాలు, చెన్నై మెట్రో, స్థానిక రవాణా ప్రాజెక్టులపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా హంగూ ఆర్భాటాలకు పోకుండా, శాసనసభా పరిధిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలిస్తుండటంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. సామాజిక మాధ్యమాల్లో, యువతలో ఆయనకున్న విపరీతమైన ఆదరణ కారణంగా.. దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ , ఇతర ప్రాంతీయ శక్తులతో సత్సంబంధాలు నెరపుతూ ప్రతిపక్షాల వరుసలో బలమైన నేతగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా, జాతీయ మీడియాలోనూ రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండగల సమర్థుడంటూ విశ్లేషణలు వెలువడటం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ప్రజాదరణ ఆయన సత్వర ప్రజానుకూల పాలనకు సంకేతమా లేక ఇమేజ్ బిల్డింగ్ కోసం పక్కాగా రూపొందించిన పబ్లిసిటీ వ్యూహమా అనే కోణంలో చర్చలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని ప్రతిపక్షమైన డిఎమ్‌కే నేతలు విజయ్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో రైలు ప్రయాణాలు, ఆకస్మిక తనిఖీలు కేవలం కెమెరా లైట్ల కోసమే జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్ అని, అసలైన వ్యవస్థాగత మార్పులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు. ఒక కేబినెట్ మంత్రితో కాకుండా వ్యక్తిగత అధికారంతో షో నడిపించడం, ప్రతి అంశాన్ని పిఆర్ ఈవెంట్‌గా మార్చుకోవడం ద్వారా పరిపాలనాపరమైన సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది విమర్శకుల ప్రధాన ఆరోపణ. అయినప్పటికీ, విజయ్ ప్రవేశపెట్టిన కొన్ని నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సామాన్యుడిని ఆకట్టుకుంటున్నాయి. లంచగొండితనానికి వ్యతిరేకంగా నేరుగా సీఎమ్‌ఓకి ఫిర్యాదు చేసే విజిలెన్స్ నంబర్లు ఇవ్వడం, స్వయంగా తన సొంత పార్టీ నేత లంచం కేసులో దొరికితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి జైలుకు పంపించడం వంటి చర్యలు ఆయనకు మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. మంత్రులు, అధికారులు పబ్లిసిటీ కోసం విజిట్ రీల్స్ చేయడంపై నిషేధం విధించడం కూడా ఆయన నిజాయితీని తెలియజేస్తోందని మద్దతుదారులు వాదిస్తున్నారు. సినిమాల నుంచి వచ్చిన నాయకులకు ఈ రకమైన విజనరీ మాస్ ఇమేజ్ ప్రారంభంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే సర్ప్రైజ్ విజిట్స్ అనేవి వ్యవస్థలో తాత్కాలిక భయాన్ని మాత్రమే సృష్టిస్తాయి తప్ప, శాశ్వత పాలనా సంస్కరణలను తే లేవు. సచివాలయంలో పక్కా విధాన రూపకల్పన , ఆర్థిక స్థిరత్వం, మరియు సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయడంపై విజయ్ ఎంతవరకు దృష్టి పెడతారనే దానిపైనే ఆయన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయి ప్రధాని అభ్యర్థిత్వాన్ని గురించి మాట్లాడటం విజయ్‌కి ప్రస్తుతానికి చాలా తొందరపాటే అవుతుంది. లోక్‌సభలో సంఖ్యాబలం, జాతీయ స్థాయిలో సిద్ధాంతపరమైన బలం లేకుండా కేవలం పాపులారిటీ ఆధారంగా ఢిల్లీ పీఠాన్ని ఆశించడం సాధ్యం