Kaizer News

కొర్రమీనును తలదన్నే చేపల కూర ఇదే.. ఇలా చేస్తే రుచి

కొర్రమీనును తలదన్నే చేపల కూర ఇదే.. ఇలా చేస్తే రుచి అద్దిరిపోద్ది.. కనిపిస్తే అస్సలు వదలొద్దు

· National - India · tv9telugu.com

ఒక్కసారైనా ఈ చేపల కూర చేసుకుని తినాలి. ఎందుకంటే ఇది నోటికి అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొందరు ఈ కూరను లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడాఇక్కడ చూస మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. వంజరం చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో వంజరం చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , కరివేపాకు, అర కట్ట కొత్తిమీర , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, సరిపడా నీరును తీసుకోవాలి. వంజరం చేపల కూర తయారీ విధానం: మీరు ముందుగా వంజరం చేప ముక్కలను తీసుకుని దానిలో ఉప్పు, పసుపుతో వేసి వాటిని బాగా శుభ్రంగా 15 నిమిషాలు వీటిని పక్కన పెట్టాలి. ఆ తరువాత చింతపండును గుజ్జును తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాన్‌లో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. వంజరం చేపల కూర తయారీ విధానం స్టెప్ 1 : ఆ తరువాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన మొత్తం పోయే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించి కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇంకా ఉప్పు కూడా దీనిలో కలపాలి. వంజరం చేపల కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో చింతపండు గుజ్జు, ఒక కప్పు నీరు పోసి వీటిని బాగా మరిగించాలి. ఆ గ్రేవీ బాగా మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న వంజరం చేప ముక్కలను వేయాలి. ఆ తరవాత మూత పెట్టి సన్నని మంటపై 15 నిమిషాల పటు ఉడికించాలి. ఈ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి

Original source: tv9telugu.com
Read more on Kaizer News