Kaizer News

Madgula: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి.. రైతు కుటుంబం

Madgula: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి.. రైతు కుటుంబంలో విషాదం!

· City - Hyderabad · hmtvlive.com

Shorts మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు కొప్పుల పాపయ్య (లాలయ్య కుమారుడు) తన వ్యవసాయ పొలంలో కట్టివేసిన ఆవుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల కాలం అనుకూలించకపోవడంతో వ్యవసాయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ సాగు కొనసాగిస్తున్న రైతు పాపయ్యకు పాడి ఆవు మృతి చెందడం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉన్న పశువుల్లో ఒకటి పిడుగుపాటుకు మృతి చెందడంతో రైతు పాపయ్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వ అధికారులు ఘటనను పరిశీలించి పాడి ఆవు మృతికి సంబంధించిన నష్టపరిహారం అందించాలని రైతు కుటుంబం కోరుతోంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News