తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసి ‘మన్మథుడు’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అక్కినేని నాగార్జున కేవలం రంగుల ప్రపంచానికే పరిమితం కాలేదు. వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఏకంగా సుమారు రూ.3,000 కోట్లకు పైగా సంపదతో భారతదేశంలోనే ధనిక కథానాయకుల్లో ఒకరిగా నిలిచినట్లు కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. నాగార్జున హీరోగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్100’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ‘బాస్’ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ టీం విడుదల చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ వరకు.. నటనతో పాటు పక్కా వ్యాపార వ్యూహాలతో అడుగులు వేశారు. ప్రతిష్టాత్మక ‘అన్నపూర్ణ స్టూడియోస్’, ఎన్ కన్వెన్షన్ వంటి వ్యాపారాలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ‘కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ’ ఫుట్‌బాల్ టీమ్ భాగస్వామ్యం ఆయనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. గతంలో ‘మాచ్ 1 రేసింగ్’ మోటార్ స్పోర్ట్స్ టీమ్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన బ్రాండ్ విలువ రోజురోజుకీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వర్గాల్లో ఆకాశమే హద్దు అన్న రీతిలో నిర్మించిన సుమారు రూ.45 కోట్ల విలాసవంతమైన బంగ్లా నాగార్జున రాజసానికి నిదర్శనం. ఆయన వద్ద ఉన్న రేంజ్ రోవర్ వోగ్, పోర్షే కయాన్, బీఎమ్‌డబ్ల్యూ ఎం6, ఆడి ఏ7, టొయోటా వెల్‌ఫైర్ వంటి కార్ల కలక్షన్‌తో వాహన ప్రియులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో ‘మా టీవీ’ నెట్‌వర్క్‌లో కీలక వాటాదారుగా ఉండి ఆ తర్వాత స్టార్ నెట్‌వర్క్‌కు విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలను గడించారు. ఇవి కాకుండా వివిధ బ్రాండులను ఎండార్స్ చేసినప్పుడు వచ్చే ఆదాయం అదనం. మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?