కెరమెరి: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివా రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. ఉద్యోగులకు ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలన్నారు. మూ డేళ్లు గడుస్తున్న పీఆర్‌సీ ప్రకటించకపోవడం సరికాదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, కేజీ బీవీ, ఎంఆర్‌సీ, సీఆర్‌సీల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఐటీడీఏ పరిధిలోని భాషా పండి ట్లు, పీడీల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. జీవో నంబర్ 317 బాధిత ఉపాధ్యాయులకు ఉమ్మడి జిల్లాల వారీగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు నవీన్‌కుమార్, ప్రదీప్ మహార్షి, తిరుమల, రంజిత, శుభాంగి తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు