Kaizer News

త్రిశూలి టన్నెల్‌‌‌‌‌‌‌‌ నుంచి సేఫ్‎గా బయటకు 63 మం

త్రిశూలి టన్నెల్‌‌‌‌‌‌‌‌ నుంచి సేఫ్‎గా బయటకు 63 మంది ఇండియన్లు

· National - India · v6velugu.com

ఖాట్మండు: ఆకస్మిక వరద కారణంగా నేపాల్‌లోని రసువా జిల్లాలో ఉన్న త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం(టన్నెల్) లోపల ఇంకా సుమారు 100 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రతికూల వాతావరణం, ఉప్పొంగుతున్న వరద నీరు నడుమ నేపాల్ సైన్యం, రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టన్నెల్ నుంచి 350 మందిని సైన్యం సురక్షితంగా కాపాడారు. టన్నెల్ నుంచి సురక్షితంగా బయటపడినవారిలో 63 మంది భారతీయులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలకు తెగించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి

Original source: v6velugu.com
Read more on Kaizer News