Kaizer News

సీఎం విజయ్‌ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో!

సీఎం విజయ్‌ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో!

· National - India · sakshi.com

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అక్కడి పుజల్‌ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. కారాగారంలో ఖైదీల బాగోగులు ఆరా తీశారు. ఖైదీలకు అందిస్తున్న ప్రాథమిక సౌకర్యాలు, వైద్య సంరక్షణ, ఆహార నాణ్యత, వృత్తి శిక్షణా కేంద్రాలను తనీఖీ చేశారు. అనంతరం ఖైదీలకు అందిస్తున్న సహాయ సహకారాలు తదితర విషయాలపై నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్‌ శుక్రవారం పుజల్‌ సెంట్రల్‌ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. తన పర్యటన సందర్భంగా విజయ్, పుజల్ సెంట్రల్ జైలు-1లోని క్వారంటైన్ జోన్, సందర్శకుల హాల్, జైలు ఆసుపత్రి, రీహాబిలిటేషన్‌ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కళాశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, అధునాతన కంప్యూటర్ శిక్షణా కేంద్రం, హై-సెక్యూరిటీ బ్లాక్, ఉరితీత ప్రాంతంతో సహా పలు కీలక సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం అక్కడే వస్త్రాలు తయారు చేసే పవర్‌లూమ్ విభాగాన్ని, అలాగే టైలరింగ్ యూనిట్‌ను సమీక్షించారు. ఆయన ఖైదీలకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, వారి సమస్యలు, అవసరాలను నేరుగా వినడానికి వారితో సంభాషించారు. జైలు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి ఎం-3 పుజల్ పోలీస్ స్టేషన్‌ను అక్కడి పోలీసు అధికారులతో రోజువారీ కార్యకలాపాలను సమీక్షించారు, స్టేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సబ్-ఇన్‌స్పెక్టర్ గది, కంప్యూటర్ గది, లాకప్ సౌకర్యాలను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో సీఎంతో పాటు పోలీస్ డైరెక్టర్ జనరల్, జైళ్లు జైళ్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (చెన్నై రేంజ్) టి. పళని, జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణరాజ్ మరియు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) Viral: రన్నింగ్ RTC బస్సు డ్రైవర్ కు గుండెపోటు

Original source: sakshi.com
Read more on Kaizer News