Kaizer News

LB Nagar: ఇంజాపూర్‌లో తీజ్‌ వేడుకల్లో ఎమ్మెల్యే మల

LB Nagar: ఇంజాపూర్‌లో తీజ్‌ వేడుకల్లో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సందడి!

· City - Hyderabad · hmtvlive.com

LB Nagar: ఇంజాపూర్‌లో బంజారా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తీజ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బంజారా మహిళలతో కలిసి సందడి చేశారు. గిరిజన సోదరీమణుల కోరిక మేరకు గోధుమ మొలకలతో కూడిన వెదురు బుట్టను నెత్తిన పెట్టుకుని బంజారా సంప్రదాయానికి గౌరవం చాటారు. డప్పుల మోత.. తీజ్‌ పాటల మధ్య మహిళలతో కలిసి అడుగులు వేస్తూ ఉత్సాహం నింపారు. బంజారాల సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు తీజ్‌ పండుగ నిలువెత్తు నిదర్శనమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇంజాపూర్‌లో బంజారా సమాజం కోసం నిర్మించనున్న హాల్‌ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News