Kaizer News

22ఏ నుంచి ఆస్తులు తొలగించండి.. కలెక్టర్‌కు ఎమ్మెల్

22ఏ నుంచి ఆస్తులు తొలగించండి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి

· City - Hyderabad · ntnews.com

మేడ్చల్‌, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ): యూఎల్‌సీ, 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరికి చెందిన యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు, కాలనీల ప్రతినిధులతో కలిసి మర్రి.. జిల్లా కలెక్టర్‌ మను చౌదరిని కలిసి సమస్యలను వివరించారు. సీతారాం నగర్‌, బలరాంనగర్‌, ఆదర్శ్‌నగర్‌, మల్లికార్జున నగర్‌, కాకతీయనగర్‌, డిఫెన్స్‌కాలనీ, జూపల్లి హోమ్స్‌ గేటేడ్‌ కమ్యూనిటీ, ఆర్‌కేపురం ఆఫీసర్స్‌ కాలనీ, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, శ్రీనగర్‌ కాలనీ, అల్వాల్‌-శ్రీధామ్‌ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆస్తులకు సంబంధించిన టైటిల్‌, లింక్‌ డాక్యుమెంట్లతో పాటు కలెక్టర్‌కు వినతి పత్రాలను అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ ఆయా సమస్యలపై రెండు రోజులలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసినవారిలో కాలనీవాసులు శ్రీనివాస్‌, అచ్యుత్‌రావు తదితరులు ఉన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News