Kaizer News

ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడే(ఆగస్టు 31) ఆఖరు తేదీ.. వ్యా

ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడే(ఆగస్టు 31) ఆఖరు తేదీ.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అలర్ట్!

· Business · v6velugu.com

ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయని వ్యాపారులు, ప్రొఫెషనల్స్ ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలులేదు. ఫైనాన్స్ యాక్ట్-2026 ద్వారా ఆదాయ పన్ను చట్టం-1961లో తీసుకువచ్చిన సవరణల ప్రకారం.. ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు నేటితో ముగియనుంది. సెప్టెంబర్ 1 వరకు వేచి చూడకుండా ఇప్పుడే హడావుడిగా రిటర్న్స్ పూర్తి చేయాలని అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు. ఆడిట్ అవసరం లేని వ్యాపారాలు, ప్రొఫెషనల్స్ కోసం ప్రభుత్వం ఈ కొత్త ఆగస్టు 31 గడువును ప్రత్యేకంగా కేటాయించింది. సాధారణ ట్యాక్స్‌పేయర్స్‌కు జూలై 31 నాడే గడువు ముగియగా.. ఇప్పుడు బిజినెస్ కేటగిరీల టర్న్ వచ్చింది. ఒకవేళ ఈ డెడ్‌లైన్ మిస్ అయితే మాత్రం జేబుకు చిల్లు పడడం ఖాయం. ఆలస్యం చేసిన ప్రతి ఒక్కరూ నవంబర్, డిసెంబర్ అంటూ కాలయాపన చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అనుకోని కారణాల వల్ల గడువులోగా ఫైల్ చేయలేకపోతే, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏవై 2026-27 కోసం డిసెంబర్ 31, 2026 వరకు లేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వెసులుబాటు ఉచితంగా రాదు. మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే రూ.వెయ్యి , మిగతా కేసుల్లో అయితే ఏకంగా రూ. 5వేలు లేట్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో సర్వర్లు డౌన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. పెనాల్టీల బారిన పడకుండా ఇప్పుడే మీ సీఏలను సంప్రదించటం బెటర్. అనవసరంగా జరిమానాలు కట్టడం కంటే.. గడువులోగా ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రశాంతంగా ఉండడమే మంచిది. పన్ను కట్టే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది అనవరసపు రుసుములు, చట్టపరమైన చర్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది

Original source: v6velugu.com
Read more on Kaizer News