Kaizer News

రాకా.. ప్రపంచ విజయం

రాకా.. ప్రపంచ విజయం

· Entertainment · ntnews.com

అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సైన్స్‌ ఫిక్షన్‌ విజువల్‌ డ్రామా ‘రాకా’. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలయ్యేందుకు ఏడాదిపైనే సమయం పట్టొచ్చు. అయినప్పటికీ ఈ సినిమా ప్రచారాన్ని మేకర్స్‌ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా ‘37’ అంటూ వారిచ్చిన పజిల్‌ అభిమానుల్లో ఉత్సుకత రేకెత్తించింది. వెంటనే శుక్రవారం మరో చిన్న బిట్‌ని వదిలి రానున్న ‘రాకా’ విజయంపై కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేశారు. ‘అసాధ్యాన్ని సాధ్యం చేసేందుకు, దాన్ని సాధించేందుకు మేం సాహసించాం.. ‘రాకా’.. ఓ ప్రపంచ విజయం’ అంటూ అతిత్వరలో ఓ అప్‌డేట్‌ని రివీల్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి ఇంకొన్ని రోజుల్లోనే ‘రాకా’ ప్రపంచం తాలూకు గ్లింప్స్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. దీపిక పడుకోన్‌, మృణాల్‌ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్‌

Original source: ntnews.com
Read more on Kaizer News