Kaizer News

సమంత స్థానంలో?

సమంత స్థానంలో?

· Entertainment · ntnews.com

సినిమాల్లో కథానాయికల మార్పు సాధారణమే. అయితే ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో ఓ నాయిక స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి మార్పే ‘చెన్నై స్టోరీ’ విషయంలో జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌లో తొలుత సమంతను కథానాయికగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత స్థానంలో శృతిహాసన్‌ను కథానాయికగా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బాఫ్టా అవార్డు విజేత, డౌన్‌టౌన్‌ అబ్బే వంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్‌జాన్‌ దర్శకత్వంలో ‘చెన్నై స్టోరీ’ తెరకెక్కుతున్నది. టిమెరి ఎన్‌ మురారి రచించిన ‘ది అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చెన్నై, ఇంగ్లాడ్‌లోని వేల్స్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో కథానాయిక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమా నుంచి సమంత తప్పుకున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అంతర్జాతీయ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News