మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైకోర్టు అనర్హత తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించలేవని ఆయన వాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ రాజీనామా చేయలేదని దానం స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానన్న దానం, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశం. హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని.. తాను ఫైటర్ నని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు. అంతలోనే ఏం జరిగిందో కానీ, మరుసటి రోజే తనకు న్యాయం చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డైరీ నంబరు 58219/2026తో పిటిషన్ దాఖలు చేసిన ఆయన, ఇందులో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2(1)(ఎ), ఆర్టికల్ 191(2) కింద తనను అనర్హుడిగా ప్రకటించడం చట్టవిరుద్ధమని దానం నాగేందర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించడానికి వీలులేదని దానం నాగేందర్ ప్రధాన వాదన. ఒకవేళ సభ లోపల సభ్యుడి (ఎమ్మెల్యే) వ్యవహార శైలి ఆధారంగానే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీ వెలుపల సభ్యుడి ప్రవర్తన లేదా ఇతర పార్టీ తరఫున పోటీ చేశారనే ఫిర్యాదులు స్పీకర్ పరిధిలోకి రావన్నారు. ఈ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సరికాదని తన పిటిషన్‌లో ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు తాను బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేవలం మెడలో మూడరంగుల కండువా వేసుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌లో చేరినట్లు భావించకూడదన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై తమ వాదనలు విన్నాకే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. తన పిటిషన్‌ను సాధ్యమైనంత త్వరగా మెన్షన్ చేసి సోమవారం అత్యవసర విచారణ కోరాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు కోరారు. ఉప ఎన్నికకు సై అన్నారు.. అయినా సుప్రీంకోర్టులో పిటిషన్ హైకోర్టు తీర్పుపై తొలుత ఉపఎన్నికకే తాను సిద్ధమని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానన్న దానం నాగేందర్, అంతలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల ఇళ్ల లబ్దిదారుల లక్కీ డ్రా ఎమ్మెల్యే లేకుండానే చేయడం, తమకు సరిగ్గా విలువ ఇవ్వడం లేదని.. అదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు అయితే అధికారులు ఉ*చ్చ పోసుకుంటున్నారని అసెంబ్లీలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇటు బీఆర్ఎస్ ఎలాగూ సీటు ఇవ్వదు. అటు కాంగ్రెస్ లోనూ జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు ఎదురైన పరిస్థితే ఖైరతాబాద్‌లో తనకు ఎదురవుతు