Kaizer News

Veldanda: ఆపదలో పేదలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్: పొన

Veldanda: ఆపదలో పేదలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్: పొనుగోటి రవీందర్‌రావు!

· City - Hyderabad · hmtvlive.com

Shorts వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన చల్ల మల్ల రామస్వామి కొద్ది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు పొనుగోటి రవీందర్‌రావు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దరఖాస్తు చేయగా పరిశీలించిన ప్రభుత్వం రూ.1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్‌ను మంజూరు చేసింది. మంజూరైన నిధులకు సంబంధించిన చెక్కును శనివారం కొట్ర గ్రామ సర్పంచ్ శారద చెన్నయ్యతో కలిసి పొనుగోటి రవీందర్‌రావు బాధితుడు చల్ల మల్ల రామస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా పొనుగోటి రవీందర్‌రావు మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందని, అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News