NASA: అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి నేల, నిర్జనమైన కొండలే గుర్తుకొస్తాయి. కానీ, ఇటీవల నాసాకు చెందిన 'క్యూరియాసిటీ రోవర్' పంపిన ఒక విచిత్రమైన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాతి గుట్టల పైన ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక నల్లటి నీడ ఆ ఫొటోలో కనిపించింది. సరిగ్గా సముద్రంలో ఈతకొట్టే 'జెల్లీఫిష్' ఆకారంలో ఉండటంతో ఇది గ్రహాంతరవాసే (ఏలియన్)! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఏలియన్స్ లాగా ఉందంటూ రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. అయితే, నాసా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి లోతుగా పరిశోధించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది