Kaizer News

Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..

· National - India · ntvtelugu.com

Asim Munir: పాకిస్థాన్ సైనిక అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉన్నఫలంగా దేశంలోని అతిపెద్ద ఆయుధ కర్మాగారమైన 'పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్' (POF)ని సందర్శించడం దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పర్యటన కేవలం ఒక సాధారణ తనిఖీకి పరిమితం కాకుండా, పాకిస్థాన్ తన సైనిక వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటోందో స్పష్టంచేస్తోంది. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పరీక్షలను స్వయంగా పరిశీలించిన మునీర్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్న రెండు కొత్త పారిశ్రామిక ప్లాంట్లను కూడా వీక్షించారు. విదేశీ ఆయుధ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ విదేశాలకు ఆయుధాలను ఎగుమతి చేయాలనే వ్యూహాన్ని పాకిస్థాన్ సిద్ధం చేసుకుంటోంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News