Kaizer News

Kapra: రూ.12,811 పలికిన కాప్రా ప్రెస్ క్లబ్ గణపతి

Kapra: రూ.12,811 పలికిన కాప్రా ప్రెస్ క్లబ్ గణపతి లడ్డూ!

· City - Hyderabad · hmtvlive.com

Shorts కాప్రా: కాప్రా ప్రెస్ క్లబ్‌లో ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న ఐదు అడుగుల మట్టి గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐదవ రోజు సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, ఉద్వాసన పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గణనాథుని ఊరేగింపుగా కాప్రా చెరువు వద్దకు తరలించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాట భక్తులను ఆకట్టుకుంది. స్వామివారి లడ్డూను క్లబ్ ఉపాధ్యక్షులు గోవిందుకుంట్ల ఆంజనేయులు రూ.12,811లకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా స్వామివారి కండువా, పంచెను క్లబ్ సభ్యులు గంగి కృష్ణ రూ.916లకు, మూడు పూల దండలను క్లబ్ సలహాదారు బెలిదే అశోక్ రూ.316లకు వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం గణనాథునికి ఉద్వాసన పూజలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించి ఊరేగింపుగా కాప్రా చెరువు వద్దకు తీసుకెళ్లారు. మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ సాగిన ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది. భక్తులు గణనాథుని నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగి నిమజ్జన కార్యక్రమంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మెరుగు చంద్ర మోహన్, సలహాదారులు బెలిదె అశోక్, ఎంపల్లి పద్మారెడ్డి, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు శనిగరం అశోక్, పటేల్ నరసింహ, మాజీ కోశాధికారి యాట రాజు, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు యావాపురం రవి, గోవిందుకుంట్ల ఆంజనేయులు, దొమ్మాటి కిరణ్ కుమార్, కోశాధికారి రామచంద్ర మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు వెంకట్, ఓ. నరసింహ, కార్యవర్గ సభ్యులు తొడుపునూరు బాలకృష్ణ, నరేష్ నాయి, పలుగుల పవన్, బసంత్ రెడ్డి, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News