Kaizer News

Atmiya Sammelanam | మర్కజీ స్కూల్లో సందడిగా ‘ఆత్మీ

Atmiya Sammelanam | మర్కజీ స్కూల్లో సందడిగా ‘ఆత్మీయ సమ్మేళనం’.. పూర్వ విద్యార్థుల కీలక తీర్మానం..!

· City - Hyderabad · ntnews.com

హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 30: హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంతో పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ స్కూల్లో 1984-85లో టెన్త్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఒకరికొకరు పలకరింపులతో సందడి చేశారు. అంతేకాదు తమ సాధకబాధకాలు పంచుకున్నారు. ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం సంబురంగా సాగింది. 1984-85లో పదో తరగతి విద్యార్థులు ఒక్కచ్టో చేరి అలనాటి రోజులను యాది చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహ బంధాన్ని ప్రతిబింబించే పాటను అందరూ ప్రశంసించారు. అనంతరం.. వచ్చే సంవత్సరం ప్రభుత్వ మర్కజీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని మిత్రులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వృద్ధిలోకి పైకొచ్చినవారు పేదరికంలో ఉన్న స్నేహితులకు తోడుగా.. వారి కుటుంబానికి అండగా నిలుస్తున్న విషయాన్ని పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆత్మీయ సమ్మేళనం సంతోషంగా జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు బింగి సురేష్‌, గోకారపు శ్యాంకుమార్‌, మాధవరావు భూపాల్‌, వేణుమాధవ్‌, ఇనుగాల రాజు, సుధీర్‌రెడ్డి, రాజారామ్మోహన్‌రాయ్‌, జావిద్‌, రాంబాబు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News