Kaizer News

ప్రారంభోత్స‌వానికి రానున్న సీఎం రేవంత్‌

ప్రారంభోత్స‌వానికి రానున్న సీఎం రేవంత్‌

· City - Hyderabad · prabhanews.com

సాయంత్రం 4 గంటలకు కార్య‌క్ర‌మం జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ స్టేడియం మైదానంలో బహిరంగ సభ అంబర్‌పేట–మూసారాంబాగ్‌కు కొత్త వారధి రాకపోకలకు భారీ ఊరట వరద ముప్పుకు ఇక చెక్‌ రూ.52 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి ట్రాఫిక్‌ కష్టాలకు తెర 400 మీటర్ల పొడవుతో కొత్త వంతెన వర్షాల్లోనూ ఇక నిరంతర రాకపోకలు హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట, మూసారాంబాగ్‌ ప్రాంతాల మధ్య రాకపోకలకు కీలకమైన మూసారాంబాగ్‌ హైలెవల్‌ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రానుంది. మూసీ నదిపై సుమారు రూ.52 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వాహనదారులకు గణనీయమైన ఊరట లభించనుంది. మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిపై నిర్మించిన ఈ హైలెవల్‌ వంతెన సుమారు 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వంతెనకు ఇరువైపులా ప్రత్యేకంగా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న తక్కువ ఎత్తు వంతెనకు ప్రత్యామ్నాయంగా అధిక ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం వల్ల మూసీ వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వర్షాకాలంలో మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు పాత లో-లెవల్‌ వంతెనపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. కొన్ని సందర్భాల్లో వంతెనను మూసివేయాల్సి రావడంతో అంబర్‌పేట, మూసారాంబాగ్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. కొత్త వంతెనను సుమారు 10 మీటర్ల ఎత్తులో నిర్మించడంతో ఈ సమస్య గణనీయంగా తగ్గనుంది. ఈ వంతెన ప్రధానంగా అంబర్‌పేట, మూసారాంబాగ్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గంగా మారనుంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలపై పడే వాహనాల ఒత్తిడి తగ్గేందుకు ఈ వంతెన దోహదపడనుంది. మూసారాంబాగ్‌–అంబర్‌పేట ప్రాంతంలో వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలీ కేఫ్‌ సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వంతెనను ప్రారంభించిన అనంతరం అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ స్టేడియం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను మరింత తగ్గించేందుకు సైదాబాద్‌ పరిధిలోని చంచల్‌గూడ, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులను కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మూసారాంబాగ్‌ హై

Original source: prabhanews.com
Read more on Kaizer News