Kaizer News

Attapur: అత్తాపూర్ గణేశ మండపం వద్ద ఉచిత వైద్య శిబి

Attapur: అత్తాపూర్ గణేశ మండపం వద్ద ఉచిత వైద్య శిబిరం

· City - Hyderabad · hmtvlive.com

Shorts Attapur: హైదరాబాద్‌ పోచమ్మ ఆలయం అత్తాపూర్‌లోని గణేశ మండపం వద్ద నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కేర్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, బరువు, 2డీ ఎకో, డెంటల్, కంటి పరీక్షలతో పాటు వైద్యుల సంప్రదింపులు అందించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. స్థానికులు, భక్తులు 200 మందికి పైగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, అసోసియేషన్ సభ్యులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News