Kaizer News

సీఎం విజయ్ స్పీడ్ కు కళ్లెం: అలా చేయకపోతే టీవీకే ప

సీఎం విజయ్ స్పీడ్ కు కళ్లెం: అలా చేయకపోతే టీవీకే పొత్తు నుంచి వైదొలగుతాం

· National - India · telugu.oneindia.com

తమిళనాడు రాజకీయాల్లో నూతన అలజడి రేగింది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అధికారంలో ఉన్న టీవీకే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. విజయ్ దూకుడుకు ఎక్కడికక్కడ కళ్లెం వేసే ప్రయత్నాలకు తెర తీసింది కాంగ్రెస్ పార్టీ. తనకు అలవాటైన రీతిలో టీవీకేకు బెదిరింపుల పర్వానికి అడుగు వేసింది. ప్రత్యేకించి.. మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని అభ్యర్థిత్వంపై ఈ విభేదాలు భగ్గుమంటోన్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే, తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ నేత, తమిళనాడు మంత్రి ఎస్ రాజేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. విజయ్ ను టీవీకే, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తోండటమే ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రాజేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు క్యాబినెట్‌లో కాంగ్రెస్ తరఫున రాజేష్ కుమార్ తో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి పీ విశ్వనాథన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ పొత్తు ధర్మానికి విరుద్ధంగా టీవీకే గనుక రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించకపోతే.. తామిద్దరం మంత్రి పదవుల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాజేష్ కుమార్ తేల్చి చెప్పారు. దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఉన్న అయిదు మంది ఎమ్మెల్యేలూ టీవీకేకు మద్దతు ఇచ్చారు. ఈ పొత్తులో భాగంగానే ఆ పార్టీకి క్యాబినెట్‌లో స్థానం దక్కింది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాన మంత్రి పదవికి తగిన అభ్యర్థి విజయ్ అంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. బంగారం ధరల్లో భారీ స్లంప్- అమ్మకాల ఒత్తిడితో గడగడ ఇదే విషయాన్ని టీవీకే ప్రచారం చేసుకుంటోంది. పార్టీ పెట్టిన అతి కొద్దిరోజుల్లోనే విజయ్ ప్రధానమంత్రి స్థాయి ఛరిష్మాను సాధించారని చెప్పుకొంటోంది. విజయ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని టీవీకే నాయకులు కోరుకుంటోన్నారు.ఇది వ్యవహారం కాంగ్రెస్ పార్టీ మింగుడు పడట్లేదు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి వంద రోజుల వ్యవధిలోనే కూటమిలో ఈ స్థాయిలో విభేదాలు రావడం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది. రాజేష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై పీ విశ్వనాథన్ ఇంకా స్పందించలేదు. పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకున్న స్టార్ క్రికెటర్: ఐపీఎల్ కు లైన్ క్లియర్? ఈ సారి తమిళనాడు నుంచే ప్రధాని అభ్యర్థి వస్తారంటూ గతంలో టీవీకే చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోసినట్టవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు, జాతీయ పార్టీల ప్రయోజనాల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతూనే ఉంటుందనడానికి తాజా ఉదాహరణే ఇది. విజయ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా చర్చనీయాంశమౌతోంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News