గత వారం చివరి నుంచి బంగారం, వెండి ధరలు మళ్లీ తిరోగమనంతో సాధారణ ప్రజలకు అందుబాటు దిశగా ప్రయాణిస్తున్నాయి. బులియన్ మార్కెట్లపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు ఇది చేదువార్తే అయినప్పటికీ.. శ్రావణమాసం కోసం షాపింగ్ చేసే రిటైల్ కొనుగోలుదారులకు మాత్రం పెద్ద ఊరటనే చెప్పుకోవాలి. కేవలం మూడు రోజుల్లో తులం బంగారం ఏకంగా రూ.7వేల 500 మేర తగ్గటంతో చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆగస్టు 31న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఆగస్టు 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.147 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 677గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 370గా కొనసాగుతోంది. సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 31, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది