Kaizer News

Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంత

Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..

· International · ntvtelugu.com

దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా.. 150వ టీ20ఐలో దీప్తి శర్మ చరిత్ర 171 వికెట్లతో ప్రపంచ రికార్డు Follow Us : --> Add as a preferred source on google Deepti Sharma Breaks World Record: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ ఘన విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కెరీర్‌లో 150వ టీ20ఐ మ్యాచ్ ఆడిన దీప్తి.. కేవలం 7 బంతుల్లో 3 వికెట్లు తీసి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అద్భుత రికార్డు సృష్టించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది. ఆమె ఖాతాలో ఇప్పుడు 171 వికెట్లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు ఈ రికార్డును కలిగి ఉన్న థాయ్‌లాండ్ బౌలర్ థిపాచా పుత్తావోంగ్‌ను దీప్తి అధిగమించింది. థిపాచా 170 వికెట్లతో రెండో స్థానానికి చేరింది. రువాండాకు చెందిన హెన్రియెట్ ఇషిమ్వే 164 వికెట్లతో మూడో స్థానంలో, ఇంగ్లాండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ 154 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. దీప్తి శర్మ – 171 వికెట్లు థిపాచా పుత్తావోంగ్ – 170 వికెట్లు హెన్రియెట్ ఇషిమ్వే – 164 వికెట్లు సోఫీ ఎక్లెస్టోన్ -154 వికెట్లు క్యారీ చాన్ – 153 వికెట్లు దీప్తి శర్మ బౌలింగ్ గణాంకాలు ఈ మ్యాచ్‌లో ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. ఆమె కేవలం 1.1 ఓవర్లు అంటే 7 బంతులు మాత్రమే వేసి 3 వికెట్లు పడగొట్టింది. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చివరి వికెట్‌ను కూడా దీప్తే తీసి థాయ్‌లాండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. ముఖ్యంగా ఆమె తన స్పెల్‌లో తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసుకోవడం విశేషం. అనంతరం చివరి ఓవర్‌లో తిరిగి బౌలింగ్‌కు వచ్చి నన్నపట్ కొంచరోయెంకై వికెట్‌ను పడగొట్టి తన రికార్డును పూర్తి చేసింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్ దీప్తి శర్మకు మరో ప్రత్యేకమైన మైలురాయిని అందించింది. ఇది ఆమెకు 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. దీంతో 150 టీ20ఐ మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి చేరింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 150 లేదా అంతకంటే ఎక్కువ మహిళల టీ20ఐలు ఆడిన క్రికెటర్లలో ఆమె 12వ క్రీడాకారిణి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుత ఆరంభాన్ని అందించింది. ఆమె కేవలం 36 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే షఫాలీ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ కాస్త తడబడింది. థాయ్‌లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసుకోవడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 94 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీప్తి శర్మతో పాటు నందిన

Original source: ntvtelugu.com
Read more on Kaizer News