Kaizer News

తుక్కుగూడలో ‘ఆర్జీకర్‌’ తరహా అఘాయిత్యం

తుక్కుగూడలో ‘ఆర్జీకర్‌’ తరహా అఘాయిత్యం

· City - Hyderabad · sakshi.com

సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడలో నర్సు అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చింది. యువతిపై లైంగిక దాడికి యత్నించి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా మెకానిక్‌గా పని చేసే సనావుల్లా అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అంతేకాదు.. మృతదేహంపై కూడా లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. దీంతో ఈ ఘటనకు.. కోల్‌కతాలో జరిగిన సంచలన ఆర్జీకర్‌ ఆస్పత్రి ఘటనను పోలిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ జోరందుకుంది. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్‌లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ కారణంతో రూమ్మేట్స్‌ ఊరెళ్లగా.. శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్‌ పోలీసులు.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో అత్యాచారం, హత్య కోణంలో విచారణ చేపట్టారు. స్థానికంగా పని చేసే మెకానిక్‌ మహ్మద్‌ సనావుల్లా(34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. కిటికీ గ్రిల్స్‌ లేకపోవడంతో.. ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ల మెకానిక్‌ షాపులో బిహార్‌కు చెందిన సనుహుల్లా (34) పనిచేస్తున్నాడు. ఇతర కార్మికులు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను కొంతకాలంగా గమనించినట్లు తెలుస్తోంది. యువతి(21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో.. బయటకు శబ్దం వినిపించకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పోలీసుల అదుపులో నిందితుడు పోలీసులు సనుహుల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే అతను రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆందోళన మరోవైపు యువతి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు తరలి వచ్చారు. ఆర్జీకర్‌ ఘటనలో ఏం జరిగింది? 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో జరిగిన ఘటన.. యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అర్ధరాత్రి 31 ఏళ్ల

Original source: sakshi.com
Read more on Kaizer News