Kaizer News

Paradise: రూ.200 కోట్ల గేమ్ ఆడుతున్న నాని.. ఏం జరుగుతుందో ఏమో

· Entertainment · tv9telugu.com

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్‌’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌పై ట్రేడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. థియేట్రికల్‌ రైట్స్‌ రూ.103 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం రూ.35 కోట్లు, సీడెడ్‌ రూ.10 కోట్లు, కోస్టల్‌ ఆంధ్రా రూ.30 కోట్ల బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌, ఇతర ప్రాంతాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ భారీగా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News