నగరంలో వర్షం శనివారం భారీగా కురిసింది. హయత్‌నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, ఉప్పల్, రామాంతాపూర్, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులతో నగరం ఉక్కపోతమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసింది