Kaizer News

పాక్‌లో చారిత్రక గురుద్వారా కూల్చివేత భగ్గుమన్న సి

పాక్‌లో చారిత్రక గురుద్వారా కూల్చివేత భగ్గుమన్న సిక్కు ప్రపంచం

· National - India · ntnews.com

క్వెట్టా: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో చారిత్రక శ్రీ గురు గ్రంథ్‌ సాహిబ్‌ జీ గురుద్వారాను అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీంతో సిక్కులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అధికారులు ముందస్తు నోటీస్‌ ఇవ్వకుండా కూల్చివేత చేపట్టారని స్థానికులు తెలిపారు. అదే స్థలంలో గురుద్వారాను కొనసాగించడానికి, భక్తులు ప్రార్థన చేసుకోవడానికి అనువైన తాత్కాలిక స్థలాన్ని కేటాయించాలని పాక్‌ ప్రభుత్వాన్ని వారు కోరారు. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో గురుద్వారాలు కూల్చేశారని స్థానిక సిక్కులు తెలిపారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని గురుద్వారాను పునర్‌ నిర్మించాలని మాజీ ఎంపీ తర్లోచన్‌ సింగ్‌ న్యూఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌కు మెమొరాండం సమర్పించారు

Original source: ntnews.com
Read more on Kaizer News