Kaizer News

అసాధరణ సాహసం.. 18,600 అడుగుల ఎత్తులో అద్భుత రక్షణ

అసాధరణ సాహసం.. 18,600 అడుగుల ఎత్తులో అద్భుత రక్షణ ఆపరేషన్!

· National - India · prabhanews.com

నున్–కున్ పర్వత ప్రాంతంలో ప్రమాదకర వాలుపై చిక్కుకున్న బాధితుడిని కాపాడిన భారత సైన్యం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత సైన్యం మరోసారి అసాధారణ సాహసాన్ని ప్రదర్శించింది. సముద్ర మట్టానికి 18,600 అడుగుల ఎత్తులో, నున్–కున్ పర్వత ప్రాంత సమీపంలోని అత్యంత ప్రమాదకరమైన కొండ వాలుపై చిక్కుకున్న బాధితుడిని భారత సైన్యానికి చెందిన ఏవియేషన్ పైలట్లు సాహసోపేతంగా రక్షించారు. ఈ రక్షణ ఆపరేషన్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. హెలికాప్టర్‌ను సురక్షితంగా దించేందుకు సరైన స్థలం లేకపోవడం, తీవ్ర గాలులు వీయడం, ఎత్తైన ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు ఉండటం వంటి అంశాలు ఆపరేషన్‌ను మరింత క్లిష్టంగా మార్చాయి. హెలికాప్టర్ బరువును తగ్గించేందుకు అవసరం లేని పరికరాలను తొలగించడంతో పాటు, పరిమిత ఇంధనంతోనే ఆపరేషన్‌ను నిర్వహించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో హెలికాప్టర్‌లోని ఒక స్కిడ్ మాత్రమే కొండ వాలును ఆనుకునేలా చేసి, బాధితుడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి ఎక్కించారు. రోజులో అందుబాటులో ఉన్న చివరి ల్యాండింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. భారత సైనికుల అసాధారణ నైపుణ్యం, అపార ధైర్యం, కర్తవ్యనిరతికి ఈ రక్షణ చర్య మరో నిదర్శనంగా నిలిచింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాణాలను కాపాడేందుకు భారత సైన్యం ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతుందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది

Original source: prabhanews.com
Read more on Kaizer News